భర్త ఫోన్ ఎత్తలేదని క్షణికావేశం.. వివాహిత మృతి!
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త వీడియో కాల్‌కు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత విషపదార్థం తీసుకుని, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.