ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు వలిగొండ, సెప్టెంబర్ 03 (దేశ టైమ్స్): మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలకుంట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ముస్తాబై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలు, నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణుడి బాల్య లీలలను ప్రతిబింబించేలా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారుల...