DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 3:40 am Posted by : DESHA TIME

దోపిడీ లేని సమాజం కోసం పోరాడాలి..!  అబ్బాయిపాలెం  శిక్షణ తరగతులు ప్రారంభం    -జిల్లా కార్యవర్గ సభ్యులు అలవాల వీరయ్య

దోపిడీ లేని సమాజం 

కోసం పోరాడాలి..! 

 

అబ్బాయిపాలెం 

శిక్షణ తరగతులు ప్రారంభం 

 

-జిల్లా కార్యవర్గ సభ్యులు అలవాల వీరయ్య

 

*దేశ టైమ్స్ 

మహబూబాబాద్

సెప్టెంబర్ 8* 

 

 

దేశంలో 140 కోట్లు ప్రజల ఆస్తీ 300 మంది పెట్టుబడిదారులవద్ద పోగు అయింది, దోపిడీ చేయడం వల్ల దేశ సంపద కొల్ల గొట్టంవల్ల ప్రజల ఆర్థిక అసమానతల తో దోచిందని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాల వీరయ్య పిలుపునిచ్చారు. సిపిఐ (ఎం) మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు మంగళవారం అబ్బాయి పాలెం గ్రామంలో ఘనంగా ప్రారంభమైన, ఈ క్లాసులకు ముందుగా పార్టీ జెండాను సీనియర్ నాయకులు ఎర్ర వెంకన్న ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో వీరయ్య పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల వల్ల కార్మికులకు రైతులకు ఉద్యోగ ఉపాధి రంగానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. నూటికి 80 శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కూలీ రైతుల బ్రతుకులు ప్రభుత్వ విధానాల మూలాన దుర్భరమవుతున్నాయని వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న కాలంలో పాలకుల విధానాలను ప్రజలకు వివరించటానికి ఈ క్లాసులు ఉపయోగపడాలని, కార్యకర్తలు గ్రామాలు ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ అధ్యక్షత వహించగా ఖమ్మం జిల్లా సిపిఎం నాయకులు స్టడీ సర్కిల్ ఇంచార్జ్, బోడపట్ల రవీందర్ మతం మతతత్వం అంశంపై క్లాస్ బోధించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల నాయకులు జిన్నా లచ్చన్న, కొండ ఉప్పలయ్య, బోడపట్ల రాజశేఖర్, మమత, వార్డు సభ్యురాలు నందిపాటి ఉప్పలమ్మ వెంకన్న, బాణాల రాజయ్య, నాయకులు షరీఫ్, ఆల్లి శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి, జినక సైదులు, జామ్మూర్తి, కామెంల్ల వెంకన్న, తదితరులు ఉన్నారు.