ఈ ప్రమాదంలో కేతావత్ లింబ్యా (54), ఆయన భార్య కేతావత్ జమున (45), కాట్రావత్ మాన్సింగ్ (48), కేతావత్ వశ్రామ్ (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు వ్యాపారులు కాగా, జమున గృహిణిగా ఉన్నారు.
కారు డ్రైవర్ సబావత్ అశోక్‌కు తీవ్ర గాయాలు కావడంతో శంషాబాద్‌లోని ట్రైడెంట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదంపై కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.