సాహితి ఇన్ఫ్రా మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి ఈడీ సమన్లు సెప్టెంబర్ 27న విచారణకు హాజరుకావాలని ఆదేశం.. రూ.2.1 కోట్ల లావాదేవీలపై ఆరా
హైదరాబాద్: సాహితి ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 27న విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. సాహితి ఇన్ఫ్రా సంస్థకు సంబంధించిన నిధుల లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్న ఈడీ.. ఎమ్మెల్యే గాంధీకి సంబంధించిన బ్యాంక్ ఖాతాల ద్వారా సుమారు రూ.2.1 కోట్ల నిధులు మళ్లించినట్లు వచ్చిన ఆరోపణలపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ లావాదేవీల స్వభావం, ఉద్దేశం, వాటికి సరైన...