గంధం వంశీ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వితంతువులకు చీరల పంపిణ
బోనకల్, సెప్టెంబర్ 28 (దేశ టైమ్స్):
పెద్దగోపతి షాలోమ్ ప్రార్థనా మందిరంలో పర్ణశాల పండుగ సందర్భంగా గంధం వంశీ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వితంతువులకు చీరలు పంపిణీ చేశారు. ట్రస్ట్ ఫౌండర్స్ గంధం పుల్లయ్య, ఆనంద్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్స్ మాట్లాడుతూ, గంధం వంశీ జీవించి ఉన్న సమయంలో చర్చికి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించారని గుర్తుచేశారు. ఆయన సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
వంశీ స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడంతో పాటు, సేవా కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. పర్ణశాల పండుగ సందర్భంగా వితంతువులకు చీరలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు.