డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. హైదరాబాద్‌లో కలకలం
హైదరాబాద్: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడంతో మనస్తాపానికి గురై ఆమె ఈ అఘాయిత్యానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతున్న మాధురిని కుటుంబ సభ్యులు గుర్తించి, తలుపులు పగలగొట్టి కాపాడినట్లు సమాచారం. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈశ్వర్ సాయి మోసం చేశాడని మాధురి రాథోడ్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అలాగే తన ఫొటోలు, వీడియోలను ఉపయోగించి ఏఐ ద్వారా వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో షేర్...