DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 9:29 am Posted by : DESHA TIME

హైదరాబాద్ రెస్టారెంట్లలో బొద్దింకలు.. ఎలుకలు! 8 సంస్థల FSSAI లైసెన్సులు సస్పెండ్.. లక్కీ రెస్టారెంట్ మూసివేత

హైదరాబాద్‌లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై TG-SAFE అధికారులు సెప్టెంబర్ 24న ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 8 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు 15 రెస్టారెంట్లను తనిఖీ చేయగా.. పలుచోట్ల బొద్దింకలు, ఎలుకలు, ఈగలు, ఎలుకల విసర్జితాలు, గడువు ముగిసిన ఆహారం, పాడైన కూరగాయలు, అపరిశుభ్రమైన కిచెన్లు గుర్తించారు. 16 ఆహార నమూనాలను పరీక్షల కోసం సేకరించారు. 8 సంస్థల FSSAI లైసెన్సులను సస్పెండ్ చేసి కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు.