ప్రజా సేవల్లో మార్పు.. మాటల్లో కాదు చేతల్లో కావాలి
ప్రభుత్వ పథకాల అసలు లక్ష్యం చివరి లబ్ధిదారుడికి చేరినప్పుడే అభివృద్ధికి అర్థం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం సహజం. పాలకులు మారుతారు.. విధానాలు మారుతాయి.. ప్రాధాన్యతలు మారుతాయి. కానీ ప్రజల అవసరాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. సామాన్యుడికి కావాల్సింది ఏ ప్రభుత్వం అధికారంలో ఉందన్నది కాదు.. తనకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సేవ అందుతుందా లేదా అన్నదే. ఆసుపత్రిలో వైద్యం అందాలి.. పాఠశాలలో నాణ్యమైన విద్య లభించాలి.. రహదారి సక్రమంగా ఉండాలి.. తాగునీరు అందాలి.. ప్రభుత్వ కార్యాలయంలో పని సకాలంలో పూర్తవ్వాలి. ఇవే ప్రజల ప్రాథమిక...