వినాయక మండపం వద్ద యువకుడి దారుణ హత్య?
ప్రేమజంటకు సహాయం చేశాడనే పాత కక్షతో కత్తులతో దాడి చేసిన దుండగులు
హైదరాబాద్, సెప్టెంబర్ 14: హైదరాబాద్‌లోని లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. వినాయక మండపం వద్ద ఉన్న కార్తీక్ అనే యువకుడిపై దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.
నాలుగేళ్ల క్రితం ఓ ప్రేమజంటకు కార్తీక్ సహాయం చేశాడని, ఈ ఘటనపై యువతి కుటుంబ సభ్యులు అతనిపై పగ పెంచుకున్నారని తెలుస్తోంది. యువతి తన ప్రియుడితో వెళ్లిపోవడంతో అప్పటి నుంచి కార్తీక్‌పై కక్ష పెంచుకున్న కొందరు, వినాయక మండపం వద్ద అతనిపై కత్తులతో దాడి చేసినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెలుగులోకి రావాల్సి ఉంది.