బండ్లగూడలో దారుణం.. వైన్స్‌లో వ్యక్తిని కత్తులతో నరికి చంపిన దుండగులు

బండ్లగూడలో దారుణం.. వైన్స్‌లో వ్యక్తిని కత్తులతో నరికి చంపిన దుండగుల హైదరాబాద్: వినాయక చవితి వేళ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో నరికి హత్య చేశారు. దుండగులు వెంటాడటంతో ప్రాణభయంతో పరుగులు తీసిన బాధితుడు బండ్లగూడలోని సుప్రీమ్ వైన్స్‌లోకి వెళ్లాడు. అయితే దుండగులు అక్కడికి కూడా చేరుకుని వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం కారులో అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి...