ఆసియా క్రీడల్లో భారత్ కు మరో పతకం*
*ఆసియా క్రీడల్లో భారత్ కు మరో పతకం ఆసియా క్రీడల్లో భారత్కు మరో పతకం లభించింది. మహిళల ట్రెడిషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ 60 కిలోల విభాగంలో భారత క్రీడాకారిణి సుచికా తరియల్ కాంస్య పతకం సాధించారు. సెమీఫైనల్లో సింగపూర్ క్రీడాకారిణి హుమ్హున్హయో చేతిలో ఓటమి పాలైన సుచికా కాంస్యంతో సరిపెట్టుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల బృంద విభాగంలో భారత్ కు రజత పతకం దక్కింది. దీంతో ఈ ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది.