ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, స్క్రోలింగ్:13-09-26.9AM.
విదర్భ, మధ్యప్రదేశ్ ప్రాంతాలపై కేంద్రీకృతమైన అల్పపీడనం
రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం
దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచన
ఉత్తరాంధ్ర తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురు గాలులు
రాగల మూడు గంటలు ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు
పిడుగులు, ఈదురుగాలుల వేళ చెట్లు,హోర్డింగ్స్ కింద నిలబడవద్దు
పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దు
~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ