గులాబీమయమైన బోనకల్.. హోరెత్తిన భారీ బైక్ ర్యాలీ

గులాబీమయమైన బోనకల్.. హోరెత్తిన భారీ బైక్ ర్యాలీ బోనకల్, సెప్టెంబర్ 21 (దేశ టైమ్స్): బోనకల్‌లో బీఆర్ఎస్ నూతన మండల పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పట్టణం గులాబీమయమైంది. బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ముఖ్య అతిథిగా హాజరై సోమవారం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.   ఈ సందర్భంగా రావినూతల నుంచి బోనకల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గులాబీ జెండాలతో సాగిన ర్యాలీతో పట్టణ ప్రధాన వీధులు పార్టీ నినాదాలతో మార్మోగాయి.  ...