DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 4:19 am Posted by : DESHA TIME

కరీంనగర్ జిల్లాలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో పెట్రోలింగ్ వాహనం చోరీ

*కరీంనగర్ జిల్లాలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో పెట్రోలింగ్ వాహనం చోరీ కలకలం రేపుతోంది.* *గంజాయి మత్తులో ఓ యువకుడు ఏకంగా పోలీసు వాహనాన్ని ఎత్తుకెళ్లాడు..!!*

వెంటనే గుర్తించిన పోలీసులు వాహనం కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అయితే గంజాయి మత్తులో ఉన్న యువకుడు ర్యాష్ డ్రైవింగ్ చేసి ఎల్కతుర్తి దగ్గర అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఆపై పోలీస్ క్యాప్ పెట్టుకుని వాహనాలను ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అటుగా వచ్చిన ఎల్కతుర్తి పోలీసులు అనుమనం వచ్చి కరీంనగర్ రూరల్ పోలీసులకు సమాచారం అందజేశారు. అప్పటికే వాహనం మిస్సింగ్‌పై కరీంనగర్‌లో పోలీసులు వెతుకుతున్నారు. అసలు విషయం తెలిసిన వెంటనే ఎల్కతుర్తి పోలీసులు.. వాహనంతో పాటు గంజాయి మత్తులో ఉన్న యువకుడిని ఎల్కతుర్తి నుంచి కరీంనగర్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం.