హైదరాబాద్ వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ బస్టాండ్ సమీపంలో తెల్లవారుజామున దారుణ హత్య చోటుచేసుకుంది. పాల వ్యాపారి భుజంగరావు (60) కత్తి దాడిలో మృతి చెందారు.
ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదం కారణంగా ఇంటి పొరుగునే నివసించే శివేందర్ సింగ్, పాల సరఫరాకు వెళ్తున్న భుజంగరావుపై కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భుజంగరావు మృతి చెందినట్లు సమాచారం.
హత్య అనంతరం నిందితుడు శివేందర్ సింగ్ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఇతర వివరాలను పోలీసులు విచారిస్తున్నారు.