*మరిపెడ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ
దేశ టైమ్స్
మహబూబాబాద్/మరిపెడ సెప్టెంబర్ 18
మహబూబాబాద్ జిల్లా
మరిపెడ మున్సిపాలిటీలోవినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరిపెడ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు.
అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో అమ్మవారికి అభిషేకాలు, పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సౌభాగ్యం వెల్లివిరియాలని, కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. లక్ష్మీ అమ్మవారి కృపాకటాక్షం, అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.
ప్రతి వినాయక చవితి ఉత్సవాల్లో శుక్రవారం రోజున కుంకుమ పూజ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొంటే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు.