యువతికి వీడియో కాల్ చేసి కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్ మలక్‌పేటలో విషాదం.. అంబర్‌పేట హెడ్‌క్వార్టర్స్‌లో రైటర్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ (35) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముసారాంబాగ్ శాలివాహననగర్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి ఓ యువతికి వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చూపించినట్లు సమాచారం. దీంతో యువతి చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.