DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 5:06 pm Posted by : DESHA TIME

9వ తరగతి బాలిక గర్భవతి.. వంట మనిషిపై పోక్సో కేసు!

పోలవరం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తొమ్మిదో తరగతి విద్యార్థిని గర్భవతి కావడంతో విషయం బయటపడింది. అదే పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తున్న వ్యక్తి తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక ఆరోపించినట్లు సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై హెడ్మిస్ట్రెస్, హెచ్ఐడబ్ల్యూఓ, మరో ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం.