మూడు నెలల్లో 16 హత్యలు.. పోలీసులకు షాక్! మహిళా వేషంలో పరారవుతుండగా పట్టుబడ్డ కిల్లర్

హైదరాబాద్, సెప్టెంబర్ 23: బ్రెజిల్‌లో వరుస హత్యల కేసు సంచలనం సృష్టించింది. పరైబా రాష్ట్రంలోని ములుంగు ప్రాంతానికి చెందిన జోర్లాన్ లోపెస్ డా సిల్వా (33)ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత మూడు నెలల్లో జరిగిన 16 హత్యలతో అతడికి సంబంధం ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు మహిళా వేషం ధరించి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. మహిళల దుస్తులు, విగ్, చెప్పులు, కళ్లద్దాలు ధరించడంతో పాటు గోళ్లకు రంగు వేసుకుని తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. ఓ...