*మానసిక స్థితి తో ఇబ్బంది పడుతూ…ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య వైనం*
హైదరాబాద్
కేపీహెచ్‌బీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది.
డిప్రెషన్‌తో బాధపడుతున్న 30 ఏళ్ల సీతా పురుషోత్తం అనే మహిళ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి మృతి చెందింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సోమవారం సాయంత్రం టెర్రస్‌పైకి వెళ్లిన ఆమె కొద్దిసేపటి తర్వాత అపార్ట్‌మెంట్ గేటు ఆవరణలోకి దూకింది.
తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది.
కొంతకాలంగా డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.