🚨 పాఠశాలలో విషాదం.. చెట్టు కొమ్మలు విరిగిపడి విద్యార్థిని మృతి
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఆటల పోటీల్లో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థులపై చెట్ల కొమ్మలు విరిగిపడిన ఘటనలో మూడో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక బాగాయత్ పాఠశాలలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. ఉపాధ్యాయులు పిల్లలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ చెట్టు కొమ్మ విరిగి పక్కనే ఉన్న మరో చెట్టుపై పడింది. ఆ బరువుకు రెండు చెట్ల కొమ్మలు ఒక్కసారిగా కింద ఆడుకుంటున్న విద్యార్థులపై కూలాయి. ఈ ప్రమాదంలో...