నల్లగొండలో విషాదం.. ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి!

నల్లగొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా దేవరకొండ రోడ్డులోని గంగవారి గూడెం వెళ్లే మార్గంలో ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యుత్ తీగలకు తగలడంతో రాజు అనే వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదం అనంతరం స్థానికులు వెంటనే ఫ్లెక్సీని తొలగించి విద్యుత్ సరఫరాను నిలిపివేసేందుకు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి...