Date of Publish : 11 August 2026, 2:37 pmPosted by : DESHA TIME
ఆర్టీసీ డిపోలో విషాదం.. మెకానిక్ మృతి
ఆర్టీసీ డిపోలో విషాదం.. మెకానిక్ మృతి
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఆర్టీసీ బస్సు డిపోలో మంగళవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. బ్రేక్ సమస్యతో ఉన్న బస్సును మరమ్మతులు చేస్తున్న మెకానిక్ సంతోష్ కుమార్ (39) బస్సు కింద ఉండగా.. డ్రైవర్ బస్సును ముందుకు నడపడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
మరమ్మతులు పూర్తయ్యాక బస్సు కింద నుంచి మెకానిక్ పక్కకు రాకముందే బస్సును ముందుకు తీసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.