DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 2:04 pm Posted by : DESHA TIME

భార్యను హత్య చేసి.. పొదల్లోనే పడేసిన భర్త!

పశ్చిమ గోదావరి జిల్లా | ఆకివీడు

ఉప్పుటేరు వద్ద ఈ నెల 15న లభ్యమైన మహిళ మృతదేహం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త నారాయణరావే తన భార్య ఉప్పాడ దేవిని హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

🔴 భీమవరంలోని అపార్ట్‌మెంట్‌లో దేవిని గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

🔴 అనంతరం మృతదేహాన్ని ఆకివీడు సమీపంలోని పొదల్లో పడేసినట్లు గుర్తించారు.

🔴 మృతురాలి ఎడమ కాలికి ఉన్న సర్జికల్ స్టీల్ ప్లేట్, స్క్రూ ఆధారంగా పోలీసులు ఆమెను ఉప్పాడ దేవిగా గుర్తించారు.

కుటుంబ కలహాలే హత్యకు కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు.

#Akividu #WestGodavari #AndhraPradesh #CrimeNews #MurderCase #DeshaTimes