DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 8:42 am Posted by : DESHA TIME

ముళ్ల పొదల్లో పసికందు.. గొర్రెల కాపరుల చొరవతో ప్రాణాపాయం తప్పింది!

అనంతపురంలో అమానవీయ ఘటన.. 😢

ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామ సమీపంలోని నగరవనం ఎదుట ముళ్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఆడ శిశువును వదిలి వెళ్లారు.

చిన్నారి ఏడుపులు విన్న గొర్రెల కాపరులు వెంటనే గుర్తించి రక్షించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 🏥

శిశువు ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం శిశు సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని ICDS సూపర్వైజర్ తెలిపారు.

చిన్నారిని ముళ్ల పొదల్లో వదిలివెళ్లిన వారెవరనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

#Anantapur #Atmakur #AndhraPradesh #BabyRescued #DeshaTimes