షాకింగ్ హత్య.. తండ్రే కూతురి ప్రాణాలు తీయించాడు!

"నా కూతురు వల్ల పరువు పోతుంది.. ఆమెను చంపేయ్" అంటూ ప్రియుడికే చెప్పిన తండ్రి! హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారు డిక్కీలో మహిళ మృతదేహం లభించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలు గోదావరిఖనికి చెందిన మానస (33)గా పోలీసులు గుర్తించారు. పెళ్లి విషయంలో మానస తన సహజీవన భాగస్వామి వినోద్ కుమార్‌పై ఒత్తిడి చేయడంతో, అతడు ఆమె తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పరువు పోతుందనే కారణంతో మానసను చంపేయాలని తండ్రి చెప్పినట్లు విచారణలో వెల్లడైంది....