“నా కూతురు వల్ల పరువు పోతుంది.. ఆమెను చంపేయ్” అంటూ ప్రియుడికే చెప్పిన తండ్రి!
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారు డిక్కీలో మహిళ మృతదేహం లభించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలు గోదావరిఖనికి చెందిన మానస (33)గా పోలీసులు గుర్తించారు.
పెళ్లి విషయంలో మానస తన సహజీవన భాగస్వామి వినోద్ కుమార్‌పై ఒత్తిడి చేయడంతో, అతడు ఆమె తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పరువు పోతుందనే కారణంతో మానసను చంపేయాలని తండ్రి చెప్పినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ క్రమంలో వినోద్ మానసను గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని కారులో తరలించినట్లు పోలీసులు తెలిపారు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఎల్కతుర్తి శివారులో వినోద్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
#Hanamkonda #Elkathurthi #CrimeNews #MurderCase #TelanganaNews #DeshaTimes