DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 4:35 am Posted by : DESHA TIME

హైదరాబాద్–విజయవాడ హైవేపై ఘోర బస్సు ప్రమాదం.. 5 మంది మృతి!

తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్ డీసీఎంను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో 5 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 20 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.

 ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

 మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

#BreakingNews #BusAccident #Kodaḍa #HyderabadVijayawadaHighway #RoadAccident #DeshaTimes