బస్వాపురం ప్రాజెక్టులోని నీటిని వదిలి పంట పొలాలను కాపాడాలి: సిర్పంగి స్వామి
బస్వాపురం ప్రాజెక్టులోని నీటిని వదిలి పంట పొలాలను కాపాడాలి: సిర్పంగి స్వామి వలిగొండ, ఆగస్టు 22 (దేశ టైమ్స్) బస్వాపురం ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిని బునాదిగాని కాలువ ద్వారా నీటిని వదిలి బునాదిగాని చెరువు ద్వారా వలిగొండ మండలంలో ఎండిపోతున్న పంట పొలాలను రక్షించాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి అన్నారు. శనివారం మండలంలోని కెర్చిపల్లి, మొగిలిపాక, తుర్కపల్లి గ్రామాలలో ఈనెల 29,30,31 తేదీల్లో నిర్వహించనున్న సిపిఎం పాదయాత్ర కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడుతూ బస్వాపురం ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు...