బస్వాపురం ప్రాజెక్టులోని నీటిని వదిలి పంట పొలాలను కాపాడాలి: సిర్పంగి స్వామి
వలిగొండ, ఆగస్టు 22
(దేశ టైమ్స్)
బస్వాపురం ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిని బునాదిగాని కాలువ ద్వారా నీటిని వదిలి బునాదిగాని చెరువు ద్వారా వలిగొండ మండలంలో ఎండిపోతున్న పంట పొలాలను రక్షించాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి అన్నారు. శనివారం మండలంలోని కెర్చిపల్లి, మొగిలిపాక, తుర్కపల్లి గ్రామాలలో ఈనెల 29,30,31 తేదీల్లో నిర్వహించనున్న సిపిఎం పాదయాత్ర కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడుతూ బస్వాపురం ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు విడుదల చేయడం ద్వారా భువనగిరి, వలిగొండ మండలాలతోపాటు ఆత్మకూర్, మోత్కూర్, అడ్డగూడూర్ మండలాలకు చెందిన పంట పొలాలకు నీరు అందుతుందని, వెంటనే నీటిని విడుదల చేసి బునాదిగాని కాలువ ద్వారా రైతాంగానికి నీరు అందించాలని డిమాండ్ చేశారు. వేలాది రూపాయల ఖర్చు పెట్టి పంట పొలాలను సాగు చేసుకున్న రైతులకు భూగర్భ జలాల కొరతతో నీరందక పంట పొలాలు ఎండిపోతున్నాయని, వెంటనే ప్రభుత్వం ఎమ్మెల్యేలు స్పందించి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మెరుగు వెంకటేశం, కందాడి సత్తిరెడ్డి, మొగిలిపాక గోపాల్, దయ్యాల మల్లేశం, పలుసం స్వామి, జక్క రాఘవరెడ్డి, కందగట్ల సాయి రెడ్డి, సల్ల ఐలయ్య, తుమ్మల సంజీవరెడ్డి, లోడే మల్లేశం, తుమ్మల నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.