రోడ్డు ప్రమాదం: ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బెంగళూరు బస్సు.. 4-6 మంది మృతి

రోడ్డు ప్రమాదం: ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బెంగళూరు బస్సు.. 4-6 మంది మృతి   చిలకలూరిపేట: పట్టణంలోని అవుట్‌రోడ్డు సెంటర్‌లో గురువారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోటప్పకొండ నుండి వేలూరు గ్రామానికి బయలుదేరిన ప్రయాణికులను బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఘటనా స్థలిలోనే సుమారు 4 నుంచి 6మంది దుర్మరణం చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ప్రయాణికులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.సమాచారం...