DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 9:48 am Posted by : DESHA TIME

నల్లగొండ బ్రేకింగ్ 🚨 జీజీహెచ్‌లో నర్సింగ్ సిబ్బంది ఆందోళన.. డిప్యూటీ సూపరింటెండెంట్‌పై తీవ్ర ఆరోపణలు!

నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు.

మహిళా ఉద్యోగులతో అనుచిత, అన్‌పార్లమెంటరీ భాషలో మాట్లాడుతున్నారని, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని నర్సింగ్ సిబ్బంది ఆరోపించారు.

“నాలుగేళ్లుగా భరిస్తున్నాం.. ఇక భరించలేక బయటకు వచ్చాం” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తాగునీరు, వాష్‌రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్, సెక్యూరిటీ, శానిటేషన్ వంటి ప్రాథమిక సదుపాయాల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ నెలలో 14 మంది మహిళా నర్సింగ్ ఆఫీసర్లకు మెమోలు ఇవ్వడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

సెక్యూరిటీ, పారిశుద్ధ్య లోపాలకు సైతం నర్సులనే బాధ్యులను చేస్తున్నారని ఆరోపించారు.

నర్సింగ్ సిబ్బంది ఆందోళనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు తేల్చాలని వారు డిమాండ్ చేశారు.

జీజీహెచ్‌లో నర్సింగ్ సిబ్బంది సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల విజ్ఞప్తి.

గమనిక: పై ఆరోపణలు నర్సింగ్ సిబ్బంది చేసినవిగా మాత్రమే పేర్కొంటున్నాం. సంబంధిత అధికారుల వివరణ వెలువడాల్సి ఉంది.

#Nalgonda #GGH #NursingStaff #BreakingNews #DeshaTimes #TelanganaNews