DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 12:57 pm Posted by : DESHA TIME

మంచిర్యాలజిల్లా : ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి*

*మంచిర్యాలజిల్లా : ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి*

 

జన్నారం మండలంలోని లింగాయపల్లి పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి ఏసీబీకి చిక్కారు. గ్రామంలో ఒక ఇంటి పర్మిషన్కు కార్యదర్శి వరలక్ష్మి డబ్బులు డిమాండ్ చేసినట్లు స్థానికులు తెలిపారు. శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో ఆమె రూ.13వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు వివరాలు వెల్లడిస్తామన్నారు. ఏసీబీ దాడులు మండలంలో కలకలం రేపాయి.