శామీర్‌పేట: గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న బీహార్‌కు చెందిన **బైద్‌నాథ్ (29)**ను శామీర్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు భార్య, ఇద్దరు పిల్లలతో తూముకుంట చంద్రారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
బీహార్ నుంచి గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను హైదరాబాద్‌కు తీసుకొచ్చి పాన్‌షాపుల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో చాక్లెట్‌ను రూ.500కు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
పోలీసులు 25 కిలోల బరువున్న 5,298 గంజాయి చాక్లెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
📍 శామీర్‌పేట | హైదరాబాద్