DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 9:15 am Posted by : DESHA TIME

నేపాల్‌లో భారీ విషాదం.. 178 మంది భారతీయులు గల్లంతు!

భోటేకోశీ, త్రిశూలి నదుల మెరుపు వరదలతో తీవ్ర విధ్వంసం

నేపాల్‌లో ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. రసువా, నువాకోట్, ధాదింగ్, గోర్ఖా జిల్లాల్లో భోటేకోశీ, త్రిశూలి నదుల వరదల ప్రభావంతో భారీ నష్టం సంభవించింది.

🔴 నేపాల్ టూరిజం బోర్డు ప్రకారం.. • మొత్తం 644 మంది పర్యాటకులు/ప్రయాణికులు గల్లంతు • 127 మంది నేపాల్ పౌరులు • 517 మంది విదేశీయులు • గల్లంతైన విదేశీయుల్లో 178 మంది భారతీయులు • అమెరికా – 65 • ఉక్రెయిన్ – 53 • మలేషియా – 51 • ఆస్ట్రేలియా – 35 • యూకే – 33 • కెనడా – 25

భారత విదేశాంగ శాఖ ప్రకారం • 288 మంది భారతీయులు గల్లంతు • 73 మంది త్రిశూలి ప్రాజెక్టు సిబ్బంది గల్లంతు • తమిళనాడు – 86 మంది • కేరళ – 33 మంది • పశ్చిమ బెంగాల్ – 32 మంది • ఈషా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది గల్లంతైన వారిలో ఉన్నట్లు సమాచారం • ఇప్పటివరకు 21 మంది భారతీయుల రక్షణ • మానస సరోవర్‌లో మరో 200 మంది భారతీయులు చిక్కుకున్నట్లు సమాచారం

చిక్కుకున్నవారు, గాయపడిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

📞 నేపాల్ అత్యవసర హెల్ప్‌లైన్లు:

టోల్‌ఫ్రీ: 1234

హెల్ప్‌లైన్: 1144

టూరిస్ట్ పోలీస్: 9851289445