DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 8:58 am Posted by : DESHA TIME

ఈగల్ శాఖలో ‘ఇంటి దొంగలు’..! డ్రగ్స్ పెడ్లర్లతో కానిస్టేబుళ్ల కుమ్మక్కు?

 

ఈగల్ శాఖలో ‘ఇంటి దొంగలు’..! డ్రగ్స్ పెడ్లర్లతో కానిస్టేబుళ్ల కుమ్మక్కు?

 

హైదరాబాద్‌లో డ్రగ్స్ నిర్మూలన కోసం పనిచేసే ఈగల్ శాఖలోనే ఇద్దరు కానిస్టేబుళ్లపై డ్రగ్స్ దందా ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

 

కానిస్టేబుళ్లు నరహరి, స్వామి సుమారు రూ.50 లక్షల విలువైన ఎక్టసీ మాత్రలను స్వాధీనం చేసుకున్నప్పటికీ, ఆ సమాచారాన్ని అధికారులకు చేరవేయకుండా అక్రమంగా విక్రయించేందుకు డ్రగ్ పెడ్లర్లను సంప్రదించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

 

ఒక డ్రగ్ పెడ్లర్‌ను పట్టుకునేందుకు హెచ్‌న్యూ అధికారులు చేపట్టిన ఆపరేషన్‌లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. గతంలో యాంటీ డ్రగ్స్ ఆపరేషన్లలో పాల్గొని అవార్డులు అందుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై ఇప్పుడు అంతర్గత విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

 

డ్రగ్స్ అరికట్టాల్సిన శాఖలోనే ఇలాంటి ఆరోపణలు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

#Hyderabad #EagleTeam #DrugCase #Police #Drugs #TelanganaNews #DeshaTimes