DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 10:07 am Posted by : DESHA TIME

టాలీవుడ్ కింగ్ మన్మధుడు నాగార్జున గారి పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు 🙏

ఆగష్టు 29

టాలీవుడ్ కింగ్ మన్మధుడు నాగార్జున గారి పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు 🙏

 

అక్కినేని నాగార్జున (జ. ఆగష్టు 29, 1959) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఔత్సాహిక వ్యాపారవేత్త. ఇతను అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు. నాగార్జున సుమారు 100 పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువ భాగం తెలుగు సినిమాలు కాగా కొన్ని తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. నాగార్జున నటుడిగా, నిర్మాతగా కలిపి తొమ్మిది నంది పురస్కారాలు, మూడు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నాడు.

 

అక్కినేని నాగార్జున

 

అక్కినేని నాగార్జున

జననం

అక్కినేని నాగార్జున రావు

1959 ఆగస్టు 29 (వయసు: 66)

Indiaమద్రాసు, తమిళనాడు, భారత దేశం

(ప్రస్తుతం చెన్నై)

ఇతర పేర్లు

నాగ్, యువసామ్రాట్

King

పాఠశాల/కళాశాలలు

అన్నా విశ్వవిద్యాలయం

వృత్తి

నటుడు, సినీ నిర్మాత,

క్రియాశీలక సంవత్సరాలు

1986–ప్రస్తుతం

Notable work

శివ (1989),

అన్నమయ్య (1997),

శ్రీరామదాసు (2006)

భాగస్వామి

లక్ష్మీ రామానాయుడు దగ్గుపాటి (1984–1990 divorced)

అమల అక్కినేని

(1992–present)

పిల్లలు

అక్కినేని నాగచైతన్య

అక్కినేని అఖిల్

తల్లిదండ్రులు

అక్కినేని నాగేశ్వరరావు

అక్కినేని అన్నపూర్ణ

1989 లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి సినిమా అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. 1990 లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమా 13వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది. అదే సంవత్సరంలోనే శివ సినిమా హిందీ పునర్నిర్మాణంతో బాలీవుడ్ లోకి ప్రవేశించాడు. నాగార్జున పలు జీవిత చరిత్ర ఆధారిత సినిమాల్లో నటించాడు. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీ సాయి, హథీరాం బావాజీ మొదలైన వారి జీవిత చరిత్ర సినిమాల్లో నటించాడు. 1995 నుంచి ఈయన సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. అన్నపూర్ణా స్టూడియోస్ అనే సినీ నిర్మాణ సంస్థకు అధినేత. హైదరాబాదులో అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అనే లాభాపేక్షలేని సంస్థను కూడా నడిపిస్తున్నాడు.[1][2][3]

 

వ్యక్తిగతం

 

నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్‌లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించాడు. తరువాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. ఇతని ప్రథమ వివాహం ఫిబ్రవరి 18, 1984 నాడు లక్ష్మితో జరిగింది. ఈమె ప్రసిద్ధ నటుడు వెంకటేష్ కు సోదరి.[6] వీరిరువురు విడాకులు తీసుకున్నారు.[7] తరువాత 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన అమలను వివాహమాడారు. నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు. మొదటి కుమారుడు నాగ చైతన్య (పుట్టిన తేదీ నవంబర్ 23, 1986) మొదటి భార్య కొడుకు. అఖిల్ (పుట్టిన తేదీ ఏప్రిల్ 8 1994) రెండవ భార్య కొడుకు.

 

సినిమా జీవితము

 

మార్చు

నాగార్జున మొదటి చిత్రం విక్రమ్, 1986 మే 23లో విడుదల అయింది. ఈ చిత్రం హిందీ చిత్రం హీరోకి అనువాదం. తరువాత నాలుగు చిత్రాలలో నటించిన పిమ్మట, ఈయన మజ్ను సినిమాలో విషాద కథానాయకుడి పాత్ర పోషించాడు. విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి, నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. నాగార్జున, తన తండ్రితో కలసి మొదటిసారిగా కలెక్టర్ గారి అబ్బాయి చిత్రంలో నటించాడు. సినీనటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం. ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ, ఈ రెండు చిత్రములు పెద్ద విజయం సాధించి ఇతనిని విజయవంతమైన తెలుగు కథానాయకుల సరసన నిలబెట్టాయి. నాగార్జున నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వము వహించే అవకాశము ఇస్తాడన్న పేరు ఉంది. ఈ చిత్రానికి గాను నాగార్జున ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. శివ చిత్రాన్ని హిందీలో శివ అనే పేరుతోనే పునర్నిర్మించి బాలీవుడ్లో కూడా అడుగుపెట్టాడు. ఈ చిత్రం హిందిలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రెసిడెంటు గారి పెళ్ళాం, హలో బ్రదర్ వంటి చిత్రాలు ఈయనకు మాస్ హీరో అన్న పేరును తెచిపెట్టాయి. ఆ తరువాత కృష్ణ వంశీ దర్శకత్వములో విడుదలైన నిన్నే పెళ్ళాడతా భారీగా విజయవంతమయ్యింది. ఆ తరువాత అన్నమయ్య చిత్రములో వాగ్గేయకారుడు అన్నమయ్య పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించాడు. ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా నడిచింది. ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు.