DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 10:13 am Posted by : DESHA TIME

చేయూత పెన్షన్లు.. మరో 3 రోజులే ఛాన్స్*

చేయూత పెన్షన్లు.. మరో 3 రోజులే ఛాన్స్*

T.G:తెలంగాణలో చేయూత పెన్షన్ పథకం కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది.

కాగా ఈ దరఖాస్తు గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద 3.70 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

వీరిలో అత్యధికంగా 2.34 లక్షల మంది వితంతువులు, 93,151 మంది దివ్యాంగులు ఉన్నారు.

గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోల వద్ద, పట్టణాల్లో వార్డు అధికారులు, మున్సిపల్ కమిషనర్ల వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు.

https://cheyutha.telangana.gov.in వెబ్‌సైట్‌లో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయి.