– బెల్జియంలో మురుగు కాలువ తవ్వుతుండగా రూ.98 కోట్ల విలువైన బంగారం లభ్యం; ఫొటో వైరల్

బెల్జియంలో మురుగు కాలువ తవ్వుతుండగా రూ.98 కోట్ల విలువైన బంగారం లభ్యం; ఫొటో వైరల్   బెల్జియంలో ఒక ఇంటిని పునరుద్ధరిస్తున్న నిర్మాణ కార్మికులకు రూ.98 కోట్ల విలువైన బంగారు కడ్డీలు, నాణేలు కనిపించాయి. ఇంటి రెనోవేషన్ పనుల్లో భాగంగా మురుగునీటి పైపులు వేయడానికి తవ్వుతుండగా వారికి ఈ నిధి దొరికింది. అనంతరం పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేసి, బంగారాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. నిధి కోసమని ఎవరైనా ఇక్కడ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..