గినియాలో ఘోర ప్రమాదం.. 30 మంది మృతి

గినియా రాజధాని కొనక్రిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ‘దార్‌ ఎస్‌ సలామ్‌’ ప్రాంతంలోని భారీ చెత్త డంపింగ్‌యార్డ్‌ ఒక్కసారిగా కూలిపోవడంతో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొండలా పేరుకుపోయిన చెత్త వర్షపు నీటితో కలిసి పక్కనే ఉన్న పూరి గుడిసెలపై విరుచుకుపడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. #Guinea #Conakry #Accident #HeavyRain #BreakingNews #DeshaTimes