పాడెపైనే తమ్ముడికి రాఖీ కట్టిన అక్క..

రాఖీ పండుగ రోజు వచ్చి రక్షాబంధనం చేద్దాం అనుకున్నా.. ఇంతలోనే మమ్మల్ని విడిచివెళ్లావా తమ్ముడా! మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మోటపోతుల రమేష్ (36) మృతి చెందాడు. అంతిమయాత్రలో దింపుడుకల్లం వద్ద తమ్ముడి మృతదేహాన్ని చూసిన అతని అక్క కన్నీరుమున్నీరుగా విలపించింది. రాఖీ కట్టాలని ఎదురుచూసిన తమ్ముడికి.. చివరకు పాడెపైనే రాఖీ కట్టింది. అనంతరం అతని నోటిలో మిఠాయి పెట్టి, తాను కూడా తిన్నది. ఇటీవలే రమేష్ తండ్రి మృతి చెందగా.. గతంలో అతని తమ్ముడు కూడా...