సంపాదకీయం
ఇరాన్పై ట్రంప్ ఆర్థిక యుద్ధం! అమెరిడా, మాహీన్ యుద్ధంలో కొత్త ఆధ్యయం మొదలయ్యింది. ఇరాన్ను
ఆయుధాలతో దెబ్బతీయడం కుదరని పని అని అమెరికాకు తెలిసాచ్చింది. దీంతో ఇక ఆర్థిక యుద్ధం మొదలు పెట్టింది. దీంట్లోనూ ప్రపంచ దేశాలను లాగే యత్నం చేస్తోండీ. ఇరాన్ తో సంబంధాలు పెట్టుకునే దేశాలపైనా ఆంక్షలు కొనసాగిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఆయుధంలో పోరాటమైనా, ఆర్థిక పోరాటమైనా తన వంతమే నెగ్గాలన్నది ట్రంప్ వాదనగా ఉంది. నేను చెప్పినట్లు వినాలన్న ధోరణితో అమెరికా ఇప్పుడు ప్రపంచ దేశాలకు హెచ్చరికలు చేస్తోంది. ఈ క్రమంలో ఇరాన్పై మొన్నటి వరకు భౌతిక దాడులకు పాల్పడిన అమెరికా ఇప్పుడు రూటు మార్చింది. సరికొత్త ఆంక్షల పేరుతో టెహ్రాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని యోచిస్తున్నది. ఇందులో భాగంగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెం ఐరాన్పై చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను ప్రకటించారు. ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్ క్యాస్ట్’ పేరుతో ఈ కొత్త ఆంక్షల ప్యాకేజీని ప్రకటించారు. కాగా, ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాలపై ప్రభావం చూపుతున్నది. పెరిగిన చమురు ధరలు జీవన వ్యయంపై ఆందోళనలను పెంచాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఏడాది క్రితం కంటే చాలా ఎక్కువగా ఉందంతో అమెరికాతో పాటు అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. మరో వైపు ఇరాన్ పై ఆంక్షలను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు స్వాగతించారు. ఇరాన్ ఆర్థిక మూలాలను పూర్తిగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. టెహ్రాన్ పై ఇది ఒక ‘ఆర్థిక డి-చే’ లాంటిదని హెచ్చరించారు. డిజిటల్ ఆస్తులు, టెర్నాలజీ, బంగారం, విమానయానం, నౌకా రవాణా వంటి కీలక రంగాలను ఈ ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చారు. ఆరాన్ వ్యాపారం కొనసాగించే ఇతర దేశాలు, సంస్థలపై కూడా ద్వితీయ స్థాయి ఆంక్షలు విధించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో పాటు ఇరాన్ చమురు ఆదాయం, ఆయుధాల సేకరణ, సైబర్ కార్యకలాపాలతో సంబంధం ఉన్న 60కి పైగా వ్యక్తులు, కంపెనీలు, నౌకలపై కూడా ఆంక్షలు విధించారు. ఇరాన్తో ఆర్థిక పోరులో ఇది చివరి అంకమని అమెరికా ప్రకటించింది. ఇరాన్ తో సంబంధాలు తెంచుకోవాలని ప్రపంచ దేశాల నాయకులను కోరారు. మీరు మా వైపు ఉంటారా లేక మారు వ్యతిరేకంగా ఉంటారా అని అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే ఇరాన్కు మద్దతు ఇస్తున్న సుమారు 60 సంస్థలు, విదేశీ నౌకలపై అమెరికా నిఘా పెట్టింది. సహకరించే ఇతర దేశాలకూ ఆంక్షల భయం ఉంటుందని తెలిపారు. ఇరాన్ తో ఆర్థికంగా భాగస్వామ్యం వహించే ఏ దేశమైనా ఏకాకిగా మిగిలిపోతుందని బెసెంట్ తెలిపారు. ఐరాన్పై కొన్నినెలలుగా దాడులు చేసిన అమెరికా ఇప్పుడు ఆర్థికంగా వెన్నూవిరిచే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అంతర్జాతీయంగా ఇరాన్ కున్న ఆర్థిక సంబంధాలను తెంచేయడమే లక్ష్యంగా అగ్రరాజ్యం కొత్త ఆంక్షలను ప్రకటించింది. టెహ్రాన్తో సంబంధాలు కొనసాగిస్తూ, నగదు ఆశ్రమ చలామణిలో దానికి తోడ్పడే దేశాలను చాలరు వ్యవస్థ నుంచి దూరం చేస్తామని యూఎస్ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. దీనికి ఇరాన్ దీటుగా స్పందించింది. ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎదుర్కోవడానికి తమ వద్ద రెండేళ్ల ప్రణాళిక ఉందని, ప్రతీకార చర్యలు తప్పవని బదులిచ్చింది. ఇరాన్ పై అమెరికా ఆంక్షలు విధించడం కొత్తేం కాదు. ఇరాన్ కు ప్రపంచంతో ఉన్న ఆర్థిక జీవనాధారాన్ని తెగ్గొట్లడమే తాజా ఆంక్షల లక్ష్యమని బెసెంట్ ప్రకటించారు. అయితే యూఎస్ నుంచి ఎదురయ్యే ఒత్తిడిని తమ వాణిజ్య భాగస్వాములు గట్టిగా వ్యతిరేకిస్తారని టెహ్రాన్ విశ్వాసం వ్యక్తంచేసింది. ఈ మేరకు ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ గాలిబఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇతర దేశాలతో ఇరాన్ కున్న సంబంధాలను తెగ్గొట్టే స్థితిలో అమెరికా లేదన్నారు. అమెరికన్ల ప్రగల్భాలను ఎవరూ నమ్మరు. అమెరికా
ఆంక్షలప్రకటనను పరిగణనలోకి తీసుకోబోమని మా వాణిజ్య భాగస్వాములు ఇప్పటికే మాకు సందేశాలు పంపారని పేర్కొన్నారు. యూఎస్ ప్రకటనపై ఇటు ఇరాన్ ప్రభుత్వం కూడా ఘాటుగా స్పందించింది. ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎదుర్కొవడానికి మా వద్ద రెండేండ్ల ప్రణాళిక ఉందని, ప్రతీకార దాడులు తప్పవని బదులిచ్చింది. ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదనీజాదేవ్ మాట్లాదుతూ.. అమెరికా ఆంక్షలను ఎదుర్కొనేందుకు మేం సర్వసన్నద్ధంగా ఉన్నాల, శత్రువులు మాపై ఆర్థిక ఉగ్రవాద దాడికి పాల్పడాలని చూస్తున్నారు. కానీ, మా వద్ద కూడా తగిన సాధనాలు ఉన్నాయి. ఇకపై మాది కేవలం రక్షణెకి కాదు, శత్రుపులు మా వాడి కోసం ఎదురుచూడాలని హెచ్చరించారు. అమెరికా ఆంక్షలను చైనా, రష్యా అంగీడరిం చలేదని, ఇతర దేశాలు కూడా ప్రతిఘటిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఐరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహసెన్ రెజాయ్ మరింత ఘాటుగా స్పందించారు. అమెరికాకు సహకరించే ఏ దేశమైనా ‘భూకంపం లాంటి’ ప్రతీకారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పొరుగు దేశాలు సహకరిస్తే పర్షియన్ గల్ఫ్ లేదా హార్యుజ్ ఇలసంధి నుంచి చుక్కనూనె కూడా బయటకు వెళ్లనివ్వబోమని తేల్చిచెప్పారు. మరోవైపు ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదేవ్ కూడా ఇదే తరపా వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు మరో ఓటమి తప్పదు. వాషింగ్టన్ విధించిన కొత్త ఆంక్షలను ఎదుర్కోన దానికి మా వద్ద రెండేళ్ల ప్రణాళిక ఉంది. ఇరాన్ ప్రజలు, దేశ అధికారుల సంకల్పాన్ని పరీక్షించడానికి వారు చేయగలిగిందంతా చేశారు. కానీ ప్రతిసారీ విఫలమయ్యారని యూఎస్ కు కౌంటర్ ఇచ్చారు. ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్’ పేరిట 60 సంస్థలు, వ్యక్తులు, నౌడల పై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ సైనిక కార్యకలాపాలు, పెట్రోలియం, పెట్రోకెమికల్ వాణిజ్యంతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ వాటిని ప్రకటించింది.