థియేటర్లకు జై కొడుతున్న జనం*
*సెకండాఫ్ కలిసొచ్చింది!* *థియేటర్లకు జై కొడుతున్న జనం* ‘మా సినిమా చాలా బాగా ఆడుతోందండీ.. థియేటర్లకి రిపీటెడ్ ఆడియన్స్ వస్తున్నారు. ఫుట్‌ఫాల్స్ బావున్నాయి. కలెక్షన్లు చూసుకుంటుంటే కడుపు నిండిపోతోంది’ అంటూ నిర్మాతలు మనస్ఫూర్తిగా చెప్పే మాటలు విని చాలా రోజులైంది. రెండు నెలల నుంచి టాలీవుడ్ బాక్సాఫీసు కళకళలాడుతుండడం.. వీకెండ్ వస్తే చాలు హౌస్‌ఫుల్ బోర్డులు చాలా థియేటర్ల దగ్గర కనిపిస్తుండడమే దీనికి కారణం. ముఖ్యంగా ఈ రెండు నెలల కాలంలో విడుదలైన చిత్రాలకు టికెట్ రేట్ పెంపుదల లేకపోవడంతో ‘సినిమా...