DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 8:53 am Posted by : DESHA TIME

థియేటర్లకు జై కొడుతున్న జనం* 

*సెకండాఫ్‌ కలిసొచ్చింది!*

 

*థియేటర్లకు జై కొడుతున్న జనం*

 

‘మా సినిమా చాలా బాగా ఆడుతోందండీ.. థియేటర్లకి రిపీటెడ్‌ ఆడియన్స్‌ వస్తున్నారు. ఫుట్‌ఫాల్స్‌ బావున్నాయి. కలెక్షన్లు చూసుకుంటుంటే కడుపు నిండిపోతోంది’ అంటూ నిర్మాతలు మనస్ఫూర్తిగా చెప్పే మాటలు విని చాలా రోజులైంది. రెండు నెలల నుంచి టాలీవుడ్‌ బాక్సాఫీసు కళకళలాడుతుండడం.. వీకెండ్‌ వస్తే చాలు హౌస్‌ఫుల్‌ బోర్డులు చాలా థియేటర్ల దగ్గర కనిపిస్తుండడమే దీనికి కారణం. ముఖ్యంగా ఈ రెండు నెలల కాలంలో విడుదలైన చిత్రాలకు టికెట్‌ రేట్‌ పెంపుదల లేకపోవడంతో ‘సినిమా బాగుంది’ అని టాక్‌ వస్తే చాలు జనం థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఓటీటీల్లో ఎన్నో సినిమాలు వస్తున్నా జనం థియేటర్లకు వెళ్లడానికే ఆసక్తి చూపిస్తుండడం తెలుగు సినిమాకు శుభ పరిణామం.

 

ఇక ముందు కూడా కొత్తగా విడుదలయ్యే చిత్రాలకు కూడా ఇలా టికెట్‌ రేట్లు పెంచకుండా ఉంటే బాగుండుననే కోరిక ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. ఇలా కలెక్షన్ల ప్రభంజనంతో మొన్న మొన్నటిదాకా వెంటిలేటర్‌ మీదున్న తెలుగు సినిమా పరిశ్రమను పాజిటివ్‌ మోడ్‌లోకి షిఫ్ట్‌ చేసిన చిత్రాలేవి? ఆ రూట్లోనే మార్చ్‌ఫాస్ట్‌ చేసిన మిగిలిన మూవీస్‌ ఏవి? ఆలస్యం ఎందుకు ఓ సారి గుర్తుచేసుకుం