DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 9:36 am Posted by : DESHA TIME

ప్రియుడి మోజులో భర్త, అత్తను చంపేందుకు కుట్ర.. కూరలో గడ్డి మందు కలిపిన భార్య అరెస్ట్* 

*ప్రియుడి మోజులో భర్త, అత్తను చంపేందుకు కుట్ర.. కూరలో గడ్డి మందు కలిపిన భార్య అరెస్ట్*

 

*పల్లె వాణి న్యూస్*

 

నిజామాబాద్, ఆగస్టు 6: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మదక్‌పల్లి గ్రామంలో వివాహేతర సంబంధం కోసం భర్త, అత్తను హత్య చేయాలని ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

 

పోలీసుల వివరాల ప్రకారం.. మదక్‌పల్లికి చెందిన సోని అనే మహిళ తన వివాహేతర సంబంధానికి భర్త భూమయ్య, అత్త భూదేవ్వ అడ్డుగా వస్తున్నారని భావించి వారిని హత్య చేయాలని పథకం వేసింది. ఈ క్రమంలో ఇంట్లో వండిన కూరలో గడ్డి మందు కలిపి ఇద్దరికీ భోజనంగా వడ్డించింది.

 

భోజనం చేసిన కొద్దిసేపటికే భూమయ్య, భూదేవ్వ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

 

ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితురాలు సోనిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.