DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 4:59 am Posted by : DESHA TIME

అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్రను జయప్రదం చేయండి…

అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్రను జయప్రదం చేయండి…

 

కె జి కె స్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుడద గోపి బాల్నే వెంకట మల్లయ్య
బస్వగాని మహేందర్ గౌడ్

జనగాం ఆగస్టు 05 (వార్త వేదిక సూర్య )

 

తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడి అమరులైన ధర్మ బిక్షం బైరు మల్లయ్య తొట్ల మల్సూర్ దేశిని చిన్న మల్లయ్య పెరుమండ్ల జగన్నాథం గణగాని గౌరయ్య దూడల నరసయ్య ఎంతోమంది నాయకులను స్మరించుకుంటూ. మహబూబాద్ జిల్లా ఆగస్టు 2 నుండి ప్రారంభమై 18 వరకు జరిగే అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్ర జయప్రదం చేయాలని కోరుతూ..
తేదీ 05/08 /2026 బుధవారం రోజున ప్రజా సంఘాల కార్యాలయం కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బూడిద గోపి అధ్యక్షతన జరిగింది. అనంతరం బూడిద గోపి మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్న గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని అన్నారు . ఇచ్చిన మాట ప్రకారం జనగామ జిల్లాలకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు నామకరణ చేయాలి పాపన్న ఏలిన కోటలను పర్యటన కేంద్రాలుగా చేయాలని అన్నారు. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ను 10, లక్షల ఇస్తామని చెప్పారు 2000, పింఛను 4,000 వేలు ఇస్తామని చెప్పారు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జిల్లా కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య మాట్లాడుతూ50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికునికి ఎలాంటి షరతులు లేకుండా పించిని ఇవ్వాలని అన్నారు, ప్రతి గ్రామానికి 560 జీవ ప్రకారంగా 5 ఎకరాల భూమి ఇవ్వాలని లేనిచో కొనివ్వాలి అన్నారు బస్వగాని మహేందర్ మాట్లాడుతు సభ్యత్వం ఉన్న ప్రతి గీత కార్మికునికి ఎక్కడ ప్రమాదం జరిగిన ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వృత్తి ప్రమాదానికి గురైన కుటుంబాలకు పెండింగ్లో ఉన్న ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, వృత్తి చేసే ప్రతి గీత కార్మికునికి బైకులు ఇవ్వాలని అన్నారు. అలాగే
తేదీ 10/08/2026 రోజున జనగామ జిల్లా కేంద్రంలో ఉదయం 11 గంటలకు సభ ఉంటుంది వస్తున్న సందర్భంలో జనగామ జిల్లాలో ఉన్న మండలాలు అన్ని గ్రామాల నుండి బైక్ తో కల్లుగీత కార్మికులు నాయకులు ప్రజాసంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొని అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరారు .. ఈ కార్యక్రమం లో కె జి కె స్ రాష్ట్ర కమిటీ సభ్యులు కుర్ర ఉప్పలయ్య, బండపల్లి శంకరయ్య, మాచర్ల రఘురాములు, జిల్లా కమిటీ సభ్యులు బాల్నే ఉమాపతి బస్వ గాని మహేందర్, కమ్మగాని పరశురాములు ,,తాళ్ల పెళ్లి మదర్, కుర్ర రాజు, నామాల యాదగిరి, వడ్లకొండ వెంకటేష్ , యాదాండ్ల పరంధామ ,పోతుగంటి కృష్ణమూర్తి, మూల కిరణ్, సోషల్ మీడియా కన్వీనర్ మూల వైకుంఠం, పోతుల ఆంజనేయులు, కుర్ర మధు తదితరులు పాల్గొన్నారు..