పంతంగి గ్రామ పరిధిలో శనిగల గుట్ట వద్ద దారుణ హత్య.
(యాదాద్రి కరెస్పాండెంట్ ):
దేశ టైమ్స్, ఆగష్టు 23.
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ పరిధిలోని శనిగల గుట్ట వద్ద దారుణ హత్య చోటుచేసుకుంది. అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన దానయ్య (30) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.