DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 8:43 am Posted by : DESHA TIME

120 అడుగుల లోతైన బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

120 అడుగుల లోతైన బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Aug 14, 2026, 

120 అడుగుల లోతైన బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

తెలంగాణ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని కాశీంబౌలి వద్ద 120 అడుగుల లోతైన పాడుబడిన వ్యవసాయ బావిలో గుర్తు తెలియని వ్యక్తి (40) మృతదేహం కనిపించింది. దుర్వాసన రావడంతో రైతులు పోలీసులకు సమాచారం అందించారు. బావి చుట్టూ ముళ్లపొదలు, విష సర్పాలు ఉండటంతో ఎవరూ లోపలికి దిగేందుకు సాహసించలేదు. అయితే, ఎస్సై వెంకన్న తాడు సహాయంతో బావిలోకి దిగి, వారం క్రితం మరణించి ఉబ్బిపోయిన మృతదేహాన్ని తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతుడు బావి వద్దకు ఎందుకు వెళ్లాడు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.