DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 3:46 pm Posted by : DESHA TIME

బీసీ కుల గణన చేపట్టాలి:  జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీ కుల గణన చేపట్టాలి:

జాజుల శ్రీనివాస్ గౌడ్

 

వలిగొండ, ఆగస్టు 22

(దేశ టైమ్)

బీసీ కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ జాబితా లేకపోవడంతో కొంత మంది గోత్రం ఇంటి పేరు చెప్పిన పరిస్థితి నెలకొందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ బీసీలకు జనాభా ప్రాతిపదికన వాటా ఇస్తున్నారని బీసీలకు జనాభా ప్రతిపాదన వాటా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం బీసీ కులాల గణనకు వ్యతిరేకమని విమర్శించారు.నవంబర్ లో లక్ష మందితో పార్లమెంటు ముట్టడిస్తామన్నారు. బీసీ నాయకులు అంతా ఐకమత్యంతో ఉండాలని సూచించారు.స్పష్టమైన బీసీ కులాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆగస్ట్ 25న దేశవ్యాప్తంగా చేపట్టే నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సాయిని యాదగిరి, నానాచర్ల రమేష్, వరికుప్పల మధు, జాజుల లింగం గౌడ్, తాడికొండ విక్రం, నరేష్, బాబు, స్వామి, గూడూరు భాస్కర్, సాయి తదితరులు పాల్గొన్నారు.